యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. దేశవ్యాప్తంగా రోజుకో నగరం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’త్రయం గుజరాత్‌లోని కెవాడియాలోని సందడి చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ సరదగా గడిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్..రాజమౌళి కలిసి.. దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ఈ ప్రోగ్రాంకి గాను అక్కడి యూనిట్ ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం రెడీ చెయ్యడం మరింత ఆసక్తిగా మారిపోయింది.
The RRR fleet…Enroute Kevadia, Gujarat.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/4UrX7rIDUA
— RRR Movie (@RRRMovie) March 20, 2022

