telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్

ఈ రోజు ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రాయల్స్ ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా కూడా 13 మ్యాచ్‌లకిగానూ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఏడో స్థానంలో ఉంది. రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో పోరు ఆసక్తికరంగా ఉండనుంది. చూడాలి మరి ఏ మ్యాచ్ లో ఎవరు విజయం సాదితారు అనేది.

రాజస్థాన్ : రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (w), స్టీవ్ స్మిత్ (c), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి

కోల్‌కత : శుబ్మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, శివం మావి, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

Related posts