“ఉయ్యాల జంపాల” సినిమాతో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న హీరో రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. కానీ రాజ్ తరుణ్ ఇప్పుడు బాగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న “ఇద్దరి లోకం ఒకటే” చిత్రంలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇందులో షాలిని పాండేని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ట్విట్టర్ ద్వారా రాజ్ తరుణ్ తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన పెళ్ళి లవ్ కమ్ అరేంజెడ్ మ్యారేజ్ అని, ఆ అమ్మాయి పేరు తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తానని రాజ్ తరుణ్ పేర్కొన్నాడు. మరి ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా ? వేరే అమ్మాయా అనేది తెలియాల్సి ఉంది.
previous post