రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉంటోంది. అయితే, తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం చూస్తున్నది. ఆగష్టు నెలలో 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు నుంచి 10 రోజులపాటు పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీని బలోపేతం చేసే అజెండాతోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. నూతన అధ్యక్షుడిగా ఎవర్ని ఎంపిక చేయాలి అనే దానిపై కూడా కసరత్తు జరుగుతున్నది. పార్టీ చెప్పినట్టుగా నడుచుకోవడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత పవన్ బన్సల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని సమావేశంలో ఎవరూ కూడా విమర్శించలేదని, ఒకవేళ రాహుల్ అధ్యక్షుడిగా తిరిగి పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉంటె దానిని పార్టీ నాయకత్వం అంగీకరించే అవకాశం ఉందని పవన్ బన్సల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తిరిగి అద్యక్ష పదవిని చేపడితే పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగే అవకాశం ఉంటుంది.
previous post
next post


రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు