కె రాఘవేంద్రరావు దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి టాలీవుడ ప్రేక్షకులకి తెలిసింది చాలా తక్కువే. మొన్న మొన్నటి నుండే వేదికల మీదే మాట్లాడే అలవాటు చేసుకున్నారు రాఘవేంద్రరావు. ఆయన తనయుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. సైజ్ జీరో అనే చిత్రం చేసిన ప్రకాశ్ ఆ తర్వాత మార్నింగ్ రాగా అనే జాతీయ స్థాయి చిత్రం చేశాడు. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా హిందీలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు హీరో,హీరోయిన్లుగా ‘జడ్జిమెంట్ హై క్యా’ సినిమాను తెరకెక్కించాడు. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గగ సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రకాశ్ కోవెల మూడి దర్శకత్వం లో ‘జడ్జిమెంట్ హై క్యా’ సినిమా తెరకెక్కించారు. ఆయన భార్య కనిక థిల్లాన్ రచయిత్రిగా పని చేశారు. తాజాగా చిత్రానికి సంబంధించి మీడియా ఇంటర్వ్యూ ఇచ్చిన కనిక రెండేళ్ళ క్రితం తామిద్దరు విడిపోయినట్టు పేర్కొన్నారు. కొన్ని కలహాల వలన విడిపోయిన తాము ప్రస్తుతం స్నేహితులలా ఉంటున్నట్టు పేర్కొంది. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు పలు చిత్రాలకి కలసి పని చేశారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరి వైవాహిక జీవితానికి బీటలు వారినప్పటికి ఇంత వరకు ఆ వార్త బయటకి రాకపోవడం గమనర్హం.


మాజీ బాయ్ ఫ్రెండ్ తో దీపికా ఫోటో… “క్యూట్” అంటున్న భర్త