దేశంలో నదుల అనుసందానంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. సట్లేజ్, యమునా నదులను కలపాలన్న కేంద్ర ఆలోచనను మానుకోవాలని అన్నారు. ఆ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే పంజాబ్ లో సమస్యలు తలెత్తుతాయన్నారు. నీటి పంపకాల విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తాయనిహెచ్చరించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లతో కలసి ఓ ఆన్ లైన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కాలువ నిర్మిస్తే ప్రజల్లో భావావేశాలు ప్రబలుతాయని, అది దేశ సమస్యగా మారుతుందని అన్నారు.
ఈ కాలువ నిర్మాణంపై కేంద్రం ముందుకు వెళ్లేందుకే సిద్ధపడితే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడతాయని అమరీందర్ వ్యాఖ్యానించారు. హర్యానా సీఎం ఖట్టర్ స్పందిస్తూ తాను అమరీందర్ సింగ్‌తో సమావేశం అవుతానని అన్నారు. రెండు నదుల మధ్యా కాలువ నిర్మాణానికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.