telugu navyamedia
సినిమా వార్తలు

బర్త్ డే కి రామ్‌గోపాల్‌ వర్మకు ఊహించని షాక్‌..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు పుట్టినరోజు నాడు ఊహించని షాక్‌ తగిలింది. సీనియర్ నిర్మాత కేసు వేశాడు.

రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. నైనా గంగూలీ, అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు

ఈ  సందర్భంగా హీరోయిన్స్‌తో కలిసి ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా జోరుగా సాగించాడు ఆర్జీవి. కానీ ఇంతలోనే మూవీ టీమ్‌కు పెద్ద షాక్ తగిలింది.

సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఆర్జీవీ తనకు రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వాల్సి ఉందని తాజాగా నిర్మాత నట్టికుమార్ కోర్టులో కేసు వేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించాడు.

ప్రతి సినిమాకు రూ. 50 లక్షల రూపాయలు ఇస్తానని డాక్యూమెంట్ రాసి ఇచ్చిన వర్మ, చివరకు దానిపై కూడా నిలబడకుండా, 10 లక్షలు ఇస్తానంటూ అంటున్నాడ‌ని చెప్పుకొచ్చాడు.

దీంతో ఆర్జీవీ తీసిన “మా ఇష్టం” సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Related posts