గత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని ఇందుకోసం తరచుగా టీచర్లతో పాటు విద్యావంతులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పాగత పాలకులు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నా.
‘‘విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతున్నారు.
విమర్శలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా 10 ఏళ్ల నుంచి శాఖలో సమస్యలు అలానే ఉన్నాయి ప్రక్షాళన చేస్తున్నా ’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కేజీ టు పీజీ అని చెప్పి అమలు చేయలేదని పదేళ్లు విద్య పేరుతో వ్యాపారం చేశారన్నారు.
ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నానని తరచుగా టీచర్లతో చర్చలు జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. పేదలకు ప్రభుత్వ స్కూల్స్‌లో మెరుగైన విద్య అందాలి విద్యలో ప్రపంచదేశాలతో మనం పోటీపడాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రతి ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
టీచర్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఉపాధ్యాలుకు అవార్డులను అందజేశారు.

