telugu navyamedia
సినిమా వార్తలు

“ప్రేమ పుస్తకం”…

nuvve nenaipoya poetry corner
మనోహరీ! ప్రాణేశ్వరీ!!
ప్రేమామృతం కురిపించే
చల్లని చంద్రికా!
వలపుల తలపులతో
గుబాళించే మల్లికా!!
నీ తనువు తరువును
తాకిన చలువ పిల్లతెమ్మెరలు
ప్రేమ పరిమళమై
నా మది గదిని 
ముద్దాడు తున్నాయి
వలపుల వనంలో 
నీవు రాసిన ప్రేమ లేఖలు
విహంగ రాయబారులు
మోసుకొస్తున్నాయి
కొలనులోని కలువ పూలు,
లేలేత తామరాకులు,
సకల జలచరములు
మన ప్రేమకు బ్రహ్మరథం
పట్టుతున్నాయి
నీవు చదివే “ప్రేమ పుస్తకం” లోని
ప్రతి అక్షరం మన ప్రేమకు
గొడుగు పట్టుతున్నాయి
నీ మేను మ్రానుపై విరబూసిన అందాలు
“ప్రేమ విందు”చేస్తున్నాయి
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts