గర్భం దాల్చిన తొలినాళ్లలో మహిళలు మద్యం, సిగరెట్ తాగితే పుట్టబోయే పిల్లల్లో జన్యసిద్ధ వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెచ్చరించారు. చీలిన పెదవులు, అంగిలి అస్థిరత లాంటి సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. పళ్ల వరుస దెబ్బతిని, దవడలు వంకర టింకరగా మారి ముఖం వికారంగా మారుతుందని తెలిపారు. ఆసియాలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 1.7 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. భారత్‌లో ప్రతి సంవత్సరం 35 వేల మంది పిల్లలు జన్మసిద్ధ వైకల్యాలతో పుడుతున్నారని వెల్లడించారు.
next post