telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అ’ దర్శకుడి మరో డిఫరెంట్ సినిమా… “జొంబిరెడ్డి” మోషన్ పోస్టర్

Zombie-Reddy

మొదటి సినిమా ‘అ’ ద్వారానే విభిన్న చిత్రాలను రూపొందించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ యువ దర్శకుడు ‘కల్కి’ అంటూ రెండో సినిమాను రాజశేఖర్‌తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇక మూడో సినిమా మరింత డిఫరెంట్‌గా ఉండాలని ప్లాన్ చేసిన ఆయన.. లేటెస్ట్ ఇష్యూ కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. దానికి ‘జోంబీ రెడ్డి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జోంబీ అనే ఓ స్మశాన వాటికను చూపిస్తూ భయపెట్టిన ఆయన ఆ స్మశానంలోని వాతావరణం, ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మరింత భయపెట్టారు. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి వినూత్నంగా భయపెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ‘జోంబీ రెడ్డి’ సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు, ఇతర వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

Related posts