తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో గల ఆర్యవైశ్య భవన్లో ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్లో గది అద్దెకు తీసుకుని బస చేసినట్లుగా సమాచారం.
మారుతీరావు స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీరావుపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో ఆయన జైలు నుంచి బేల్ పై ఇటీవలే విడుదలయ్యారు.


సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా