‘మా’ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కుతోంది. మా.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసుకుంటున్నారు.

మా’లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ‘మా’ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందించారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని అన్నారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని అన్నారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్లతో విష్ణు కుట్రచేస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఒక వ్యక్తికి 56 మంది డబ్బులు ఇచ్చారని.. తనకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ వ్యవహారంపై మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ లో కుట్ర చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“‘మా’లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుంది. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బు కట్టారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేయాలంటే వ్యక్తిగతంగా ‘మా’కు లేఖ రాసి డబ్బు కట్టాలి. ఆగంతకులతో ‘మా’ ఎన్నికలను నిర్వహిస్తారా? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి వాళ్ల పోస్టల్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

