దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,346 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య 20 వేల కంటే తక్కువగా నమోదు కావడం గత 209 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే ఇదే సమయంలో కరోనా మరణాలు పెరుగుతుండటం కొంత ఆందోళన కలుగుతోంది.
గత 24 గంటల్లో 263 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ మరణాల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 8,850 కేసులు నమోదు కాగా… 149 మంది మరణించారు.