ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు.
అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది.
వీరి కాంబినేషన్ లో వచ్చిన ముక్కాలా..ముక్కాబుల సాంగ్ ఇప్పటికి ట్రెండింగ్ లో నిలిచింది.
అయితే ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రభుదేవా అద్భుతమైన డాన్సర్ అని, రోమియో మరియు లవ్ బర్డ్స్ అనే సినిమాలకు తాను మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న టైంలో ప్రభుదేవా చేసే డ్యాన్సులు తనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండేవని చెప్పుకొచ్చారు.
అలాగే ప్రభుదేవా కూడా రెహమాన్ మ్యూజిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రెహమాన్ సంగీతానికి డాన్స్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేయడం తనకి ఎప్పుడూ కూడా ఒక సవాలే అని ప్రభుదేవా తెలిపారు.
ఇదిలా ఉంటే దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక సినిమాకి పనిచేయబోతున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది.
ఈ చిత్రానికి మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.#ARRPD6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు ప్రభుదేవా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసారు.
ఈ చిత్రంలో యోగి బాబు, అజు వర్గీస్, అర్జున్ అశోక్, సాట్జ్, నిష్మా చెంగప్ప వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
డాన్స్ ,కామెడీ,మ్యూజిక్ ప్రధాన అంశాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాను దివ్య మనోజ్ ,ప్రవీణ్ ఎలక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు .


పవన్‌పై ‘గుండు’ కామెంట్స్ చేసిన రోజా… లైక్ కొట్టిన పూనమ్ కౌర్