బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే పెళ్లి జరిగి 20 రోజులు కూడా కాకముందే భర్తపై కేసు పెట్టి, అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సామ్ అహ్మద్ బాంబే అనే దర్శకుడితో ప్రేమలో ఉన్న ఆమె ఈ నెల 1వ తేదీన అతడ్ని పెళ్లాడింది. పెళ్లయి నెల కూడా తిరగకుండానే సామ్ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్ బాంబే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అయితే ఆమె మళ్ళీ భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ “మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవు” అని తెలిపారు. సామ్ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.
previous post