telugu navyamedia
రాజకీయ

ప్ర‌ధానిగా రాలేదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా..

సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం జమ్మూలోని నౌషేరా చేరుకున్నారు. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ప్రతి సంవత్సరం దీపావళి రోజు భారతదేశ సరిహద్దు ప్రాంతాల సరిహద్దుల్లోకి వెళ్లి కొన్ని సుదూర భద్రతల వద్ద నియమించబడిన సాయుధ బలగాల జీవితాల్లో కొంత ఆనందాన్ని తీసుకురావడం ప్రధానమంత్రి యొక్క సంప్రదాయం.

Image

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్​లో ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మోదీ.. సైనికులకు దీపావళి జ‌రుపుకున్నారు. సైనికులకు మిఠాయిలు అంద చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని మోదీ..

PM modi in rajouri

అనంతరం సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.. ప్ర‌తీ ఒక్క‌రు త‌న ఫ్యామీలీతో దీపావ‌ళి జ‌రుపుకోవాల‌ని అనుకుంటారు..నేను కూడా నా కుటుంబంతో క‌లిసి దివాళి చేసుకోవాల‌ని అనుకున్నా.. అందుకే దీపావ‌ళిని నాకుటుంబంతో క‌లిసి జ‌రుపుకునేందుకు వ‌చ్చాను ..మీరాంతా నా కుటుంబ స‌భ్యులు అని అన్నారు. తాను  ఇక్కడికి ప్ర‌ధానిగా రాలేదని.. ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చానని తెలిపారు.

ఈరోజు మీకోసం 130 కోట్ల దేశ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌ను మీకోసం తీసుకోచ్చాను అన్నారు. భరత మాతకు మన సైనికులు రక్షణ కవచం. మీవల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పండగల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మీ సామర్థ్యం, బలం దేశంలో శాంతి, భద్రతలకు భరోసా కల్పిస్తాయి. సర్జికల్​ స్ట్రైక్​ సమయంలో ఈ బ్రిగేడ్​ పోషించిన పాత్ర.. ప్రతి భారతీయుడికి గర్వకారణం.

PM modi in rajouri

శ‌తృవుల‌కు ధీటైన జ‌వాబు ఇస్తున్నార‌ని, సైనికుల సాహ‌సాలు దీపావ‌ళి వేడుక‌ల‌కు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చాయ‌ని తెలిపారు. మారుతున్న ప్రపంచం, యుద్ధ విధానానికి అనుగుణంగా సైనిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి. “దీపావళి సందర్భంగా జవాన్లకు మిఠాయిలు తినిపించారు ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దులోని పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Image

కాగా..ప్రధానమంత్రి మోడీ తెల్లవారుజామున జమ్మూలోని నౌషేరాకు బయలుదేరారు, కనీస భద్రతా ఏర్పాట్లు లేకుండా సామాన్యుడిలా వెళ్ళారు.అంతకుముందు, దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts