telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్….

Errabelli Trs

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఆత్మవిమర్ష చేసుకోవాలని… వరంగల్ వరదలప్పుడు వరంగల్ కు రావాలని కిషన్ రెడ్డిని కోరినా రాలేదని ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం వరంగల్ కు వచ్చారని.. కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు విడుదల చేయడంలో వాళ్లే జాప్యం చేశారని.. బీజేపీ అధికారంలోకి రాకముందే కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చిందన్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కేఎంసీ నిధులపై మాట్లాడుతున్నారని.. ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు దుర్భరంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధిపై గతంలో ఎందుకు సమీక్ష చేయలేదని.. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ కు వచ్చారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ జాడలేకుండా చేశారని… టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి సహకరించలేదని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఎందుకు అమలు చేయలేదని… కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తీసుకెళ్లారని ఆగ్రహించారు. రైల్వేను ప్రయివేటీకరణ చేయడం దారుణమన్నారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ ఎమైంది ?… బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదని ఫైర్‌ అయ్యారు. బీజేపీ నాయకులు వరంగల్ లో చిచ్చు పెట్టొద్దని… రాజకీయ పబ్బం కోసమే కిషన్ రెడ్డి వరంగల్ వచ్చారని విమర్శలు చేశారు.

Related posts