telugu navyamedia
రాజకీయ

శివసేన నేత సంజయ్​ రౌత్​ను అరెస్టు చేసిన ఈడీ..

శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం అరెస్టు చేసినట్లు తెలిసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు ఉదయం 7 గంటలకు సంజయ్ రౌత్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. సోదాలు నిర్వహించడంతో పాటు, పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు  ఆయనను ప్రశ్నించింది. గంటల తరబడి విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. 

అయితే తన నివాసంలో ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మహారాష్ట్ర, శివసేన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాయి.. ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు చర్య.. తప్పుడు సాక్ష్యం.. నేను శివసేనను వీడను.. నేను చనిపోయినా లొంగిపోను.. జై మహారాష్ట్ర. నాకు ఎలాంటి స్కామ్‌తో సంబంధం లేదు. బాలాసాహెబ్ మనకు పోరాడడం నేర్పించారు.. నేను శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

పాత్రచాల్​ కుంభకోణంతో సంజయ్‌ రౌత్‌తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.రూ.11.15 కోట్లు భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పాత్రచాల్​ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే రౌత్ అరెస్టును ఈడీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Related posts