telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సైనికుడి సమాధిపై పెడుతున్న పూలు మాయం… ఏం జరుగుతోందంటే ?

Pegion

రెండో ప్రపంచయుద్ధంలో పోరాడి ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియన్ సైనికుల గుర్తుగా కాన్‌బెర్రాలో వార్ మెమోరియల్‌ను గతంలో నిర్మించారు. వార్ మెమోరియల్ సందర్శనకు వచ్చే వారు.. సైనికుల సమాధులపై పూలు పెట్టడం సహజం. అయితే ఓ సైనికుడి సమాధిపై పెడుతున్న పూలు మాత్రం నిమిషాల్లో మాయమైపోతున్నాయి. పూలు ఏమవుతున్నాయో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎంత ఆలోచించినా అర్థం అయ్యేది కాదు. అసలు పూలు ఏమవుతున్నాయో తెలుసుకుందామని పూలు పెట్టిన తరువాత సమాధిని కొంతసేపు పరిశీలించగా.. ఓ పావురం సమాధిపై పెడుతున్న పూలను తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సైనికుడి సమాధి ఉన్న ప్రదేశంలోనే పావురం గూడు కట్టుకుంటోందని.. అందుకని ఆ పూలు తీసుకెళ్తోందని సిబ్బంది తెలిపారు. కాగా, మొదటి, రెండో ప్రపంచయుద్ధం జరిగిన సమయంలో ఒకరి నుంచి మరొకరికి సమాచారం చేరవేయడానికి పావురాలనే మెసెంజర్స్‌గా ఉపయోగించేవారు.

Related posts