*నుపుర్‌శర్మ వివాదస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు,హింస
*హైదరాబాద్ ఛార్మీనార్ దగ్గర ముస్లీం నిరసలు
మహ్మాద్ మతప్రబోధకుడిపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. వారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక‍్రవారం దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. లఖ్‌నవూ, మొరాదాబాద్, ప్రయాగ్‌రాజ్, సహ్‌రాన్‌పుర్ ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. ఈ ఆందోళనల్లో ఒక పోలీస్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అలాగే హైదరాబాద్‌లోని పాతబస్తీలోని చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఆందోళనకు దిగారు. మహ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి
ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్ భారత్’: కేసీఆర్