telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనా యాప్ ల నిషేధంపై స్పందించిన పేటీఎం చీఫ్!

paytm app

వాటిలో టిక్ టాక్, షేర్ ఇట్ లతో పాటు భారత్ లో 59 చైనా యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న యాప్ లను నిషేధించడం ఓ సాహసోపేతమైన చర్య అని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాల్సిన తరుణం ఇదేనని ట్వీట్ చేశారు. పేటీఎం యాప్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లో చైనా సంస్థలకు వాటాలున్నాయి. చైనా దిగ్గజ కంపెనీలు ఆలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థలు వన్97 కమ్యూనికేషన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. తన సంస్థలో చైనా భాగస్వామ్యం ఉన్నా కానీ, విజయ్ శేఖర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

Related posts