బాలీవుడ్ నటి పాయల్ రోహతగీ తరచూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో సంఘ సంస్కర్త రాజారామ్ మోహన్‌రాయ్‌ను ఆంగ్లేయుల చెమ్చాగా అభివర్ణించారు. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. సతీ సహగమనంతో పాటు బాల్య వివాహాల నిర్మూలనకు ఉద్యమించారు. అందుకే అతనిని ఆధునిక సమాజ నిర్మాత అని కూడా చెబుతుంటారని పాయల్ పేర్కొన్నారు. అయితే రాజారామ్ మనోహన్‌రాయ్‌ను ఆంగ్లేయులు సతీ సహగమనమనే ఆచారానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చెమ్చాగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. సతీ సహగమనమనేది అనివార్యం కాదని, మెఘల్ నియంతల ద్వారా వేశ్యావృత్తిలోకి దిగాల్సి వస్తున్న హిందూ మహిళలను కాపాడేందుకే ఈ ఆచారం వచ్చిందన్నారు. సతీ సహగమనమనేది మహిళల ఇష్టప్రకారం జరిగేదన్నారు. ఇది దురాచరమేమీ కాదని పాయల్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాయల్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించారనే వార్తలు వచ్చాయి.
previous post