జనసేన అధినేత పవన్ కళ్యాణ్… బీజేపీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ లో ఇవాళ జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ పై మండిపడ్డారు. బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన తో ఉన్నా… తెలంగాణ బీజేపీ తమను అవమానించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడిందని… అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కుమార్తె వాణికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు అని గుర్తు చేసారు పవన్ కళ్యాణ్. కాగా తిరుపతి ఉప ఎన్నికల్లో….. బీజేపీ పార్టీ కి జనసేన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో దిగనున్నారు.
previous post


సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: మాజీ సీఎం ఫరూక్