ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళుతున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
పండుగరోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళుతున్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి పవన్ సమర్పించనున్నారు.
ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన భద్రాచలంకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకుంటారు.
ఈ రాత్రికి భద్రాచలంలోనే ఆయన బస చేస్తారు. రేపు సీతారాముల కళ్యాణానికి పవన్ హాజరవుతారు.
ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమవుతారు.
రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకుంటారు.

