2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తాను ఇక సినిమాలకు దూరమని తేల్చి చెప్పేశారు. తాను ఇక రాజకీయాల్లోనే ఉంటానని పవన్ కళ్యాణ్ పీఆర్ టీమ్ చెప్పిన కూడా ఆయన సినీ రంగ ప్రవేశంపై వార్తలు వినపడుతూనే ఉన్నాయి. పవన్‌కల్యాణ్ ఈ సినిమాలో నటిస్తారు.. ఆ సినిమాలో నటిస్తారంటూ చాలా వార్తలు వినపడుతూ వస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రీసెంట్గా ఓ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. దాదాపు ఆయన ఈ సినిమాను చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంతకు పవన్‌ని తన కథతో మెప్పించిన దర్శకుడెవరో కాదు.. జాగర్లమూడి క్రిష్. గమ్యం, వేదం, కృష్ణమ్ వందే జగద్గురమ్, కంచె వంటి డిఫరెంట్ సినిమాలను క్రిష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకునట్లు కుదిరితే పవన్, క్రిష్ సినిమా తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.


మా ఎన్నికలపై దర్శకేంద్రుడు స్పందన….