ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం.
పవన్ కల్యాణ్ అంటే పవనం కాదని… సునామీ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఎన్డీయే కూటమి సమావేశంలో ఆయన జనసేనానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు.