telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“మన ఊరు – మాటా మంతి” కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. “మన ఊరు – మాటా మంతి” పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Related posts