telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీఎస్టీ తగ్గించడం పై కౌన్సిల్‌కు పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు

జీఎస్టీ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలపై ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఉద్ఘాటించారు.

ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు పవన్ కల్యాణ్.

పేదలు, మధ్యతరగతి, రైతులు, ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనమని చెప్పుకొచ్చారు.

విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం వల్ల ప్రజలకు భారం‌ లేకుండా ఉంటుందని వెల్లడించారు.

పేదల భవిష్యత్తును మరింత వృద్ధి చేయడాన్ని తాను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

 

Related posts