telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వ్యక్తులు అంటే నచ్చదు: షోయబ్ అక్తర్

Shoaib Akthar Pakistan

మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వ్యక్తులు అంటే తనకు అస్సలు నచ్చరని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేమయని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కొరితే అతడిని చంపేసేందుకు కూడా వెనుకాడే వాడిని కాదన్నాడు. కానీ అక్రమ్ ఎప్పుడూ నన్ను అలా అడగలేదని అక్తర్ పేర్కొన్నాడు. 1990ల్లో పాకిస్థాన్ ఆడిన కొన్ని మ్యాచ్‌లు చూశానని చెప్పాడు. నాడు అక్రమ్ అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాడని చెప్పాడు.

తన కెరీర్ మొదట్లో కూడా అక్రమ్ అండగా నిలిచాడన్నాడు. ఏడెనిమిది సంవత్సరాలు వసీంతో కలిసి ఆడానని తెలిపాడు. అప్పుడు ప్రత్యర్థి టాపార్డర్ వికెట్లు తీసే బాధ్యతను తీసుకున్న అక్రమ్ తనకు టెయిలెండర్ పని పట్టేందుకు మార్గం సుగమం చేసేవాడన్నాడు. అలాగే తనకు ఇష్టమైన ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చేవాడని తెలిపాడు. తాను ఆడుతున్న రోజుల్లో అక్రమ్‌కు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపలేదని, అందుకు బాధపడుతున్నానని షోయబ్ చెప్పాడు.

Related posts