టీం ఇండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌తో ఈ నిర్ణయాన్ని చెప్పిన పార్థివ్ అందులో బీసీసీఐ తో పాటు సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అయితే దాదా సారథ్యంలోనే పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. భారత్ తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థీవ్.. మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టులోకి రానంతవరకు కీలక ఆటగాడిగా జట్టులో కొనసాగాడు. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలతో 736 రన్స్ చేసిన పార్థీవ్.. టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశాడు. 2002 ఇంగ్లండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పార్థివ్.. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వికెట్ కీపర్‌గా గుర్తింపుపొందాడు. ఇక ఐపీఎల్ లో 139 మ్యాచ్ ఆడిన పార్థివ్ 2848 రన్స్ చేశాడు. అయితే ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో బెంగుళూర్ జట్టులో ఉన్న పార్థివ్ కు తుది జట్టులో అవకాశం రాలేదు.
previous post
next post