telugu navyamedia
క్రైమ్ వార్తలు

దారుణం… శ్రీమంతం చేస్తామంటూ అబార్షన్ చేయించారు…

crime

శ్రీమంతం చేస్తామంటూ అబార్షన్ చేయించిన దారుణ ఉదంతం తెలంగాణలోని భద్రాచలంలో జరిగింది. కూతురు గర్భవతి అయిందని తెలిసి అత్యంత ఆనందాన్ని నటించిన ఆ తల్లిదండ్రులు ఆమెకు శ్రీమంతం చేస్తామంటూ తమ ఊరికి తీసుకొచ్చారు. డాక్టర్ చెకప్ పేరిట ఆసుపత్రిలో చేర్పించిన ఆ తల్లిదండ్రులు కూతురికి బలవంతంగా అబార్షన్ చేయించిన దారుణ ఉదంతమిది. అమ్మాయిది పాల్వంచ కాగా అబ్బాయిది రామవరం. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట హైదరాబాద్‌లో వుంటోంది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా, తక్కువ కులం వారికి తల్లిగా మారబోతున్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఆగ్రహాన్ని లోలోపలే ఉంచుకున్న తల్లిదండ్రులు పైకి మాత్రం ప్రేమ నటించారు. అల్లుడి వద్దకు వెళ్లి దాన్ని మర్చిపోయి చక్కగా ఉంటామంటూ నమ్మబలికారు. కూతురికి ఆర్భాటంగా శ్రీమంతం చేస్తామంటూ తమ ఊరికి పంపించమని కోరారు. అత్తమామల ప్రేమ నాటకాన్ని నమ్మి తన భార్యను వారి వెంట పంపించాడు అల్లుడు. ఆ తర్వాత హెల్త్ చెకప్ పేరిట ఆసుపత్రికి తీసుకు వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు డాక్టర్‌తో అసత్యాలు చెప్పించి మరి ఆమెకు అబార్షన్ చేయించారు. అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు అబార్షన్ చేసిన డాక్టర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts