వైసీపీ పాలనలో ప్రజలకు దసరా సంతోషం కూడా లేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. గోదావరి బోటు ప్రమాదంపై ప్రశ్నించిన దళిత నేతపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 21 రోజులైనా ఇంత వరకు మృత దేహాలను వెలికి తీయలేకపోయారని దుయ్యబట్టారు.
సీఎం జగన్ తన అసమర్థ పాలనతో బోటును బయటకు తీయలేకపోయారని అన్నారు. సామాన్యుల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. జలవనరుల శాఖ, పర్యాటక శాఖ మంత్రులు పత్తా లేకుండా పోయారని చెప్పారు. ఓట్లు వేసిన ప్రజలకు కూడా వైసీపీ పాలనలో పండగ సంతోషం లేదన్నారు.


బెంగాల్‌ను కశ్మీర్‌లా మారుస్తున్నారు: ఎంపీ అర్జున్ సింగ్