telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాకిస్తాన్ లో దూసుకెళ్తున్న కరోనా.. కొత్తగా 1300 కేసులు నమోదు

corona pakistan

కరోనా దెబ్బకు పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజురోజుకూ అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు 24 గంటల వ్య‌వ‌ధిలోనే అక్క‌డ కొత్త‌గా 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పాకిస్థాన్‌ మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి దేశంలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారని నేషనల్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,114కు చేరిందని తెలిపింది. వారిలో 4,175 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మ‌రో 417 మంది మృతి చెందినట్టు వెల్లడించింది.

Related posts