telugu navyamedia
సినిమా వార్తలు

పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారు నటించిన “అగ్గి పిడుగు” నేటికి 60 సంవత్సరాలు

నటరత్న, పద్మశ్రీ, నందమూరి తారకరామారావు గారు ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం విఠల్ ప్రొడక్షన్స్ “అగ్గి పిడుగు” 31-07-1964 విడుదలయ్యింది.

జానపద బ్రహ్మ దర్శక, నిర్మాత బి.విఠలాచార్య గారు ‘విఠల్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: బి.విఠలాచార్య, మాటలు:జి.కృష్ణమూర్తి, పాటలు: సి.నారాయణరెడ్డి, జి.కృష్ణమూర్తి, సంగీతం: రాజన్–నాగేంద్ర, ఛాయా గ్రహణం: రవికాంత్ నగాయిచ్, కళ: బి.సి.బాబు, నృత్యం: చిన్ని, సంపత్, ఎడిటింగ్: కె.గోవిందస్వామి సమకూర్చారు.

ఈ చిత్రంలో ఎన్. టి.రామారావు, కృష్ణ కుమారి, రాజశ్రీ, రాజనాల, నాగయ్య, ముక్కామల, సత్యనారాయణ,
వల్లూరి బాలకృష్ణ, మోదుకూరి సత్యం, జయంతి, మద్దాలి కృష్ణమూర్తి తదితరులు నటించారు.

సంగీత దర్శకులు రాజన్ – నాగేంద్రన్ గార్ల స్వరకల్పనలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“ఏమో ఏమో ఇది.. నాకేమో యేమో అయినది”
“లడ్డు లడ్డు లడ్డు,బందరు మిఠాయి లడ్డూ”
“ఎవరనుకున్నావే, ఏమనుకున్నావే, చక్కని చెలికాడే”
“నేనే నేనే నేనే నీ చిన్న దానను నేనే”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తెలుగులోనే కాకుండా భారతదేశంలోనే అవిభక్త కవల పిల్లల ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న తొలి సినిమా ‘అగ్గిపిడుగు’.

ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం కావటం విశేషం. భారీ చిత్రాల నిర్మాణ వ్యయం 5 లక్షలకు పైగా అవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రం తొలి వారంలోనే 5 లక్షలు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో100 రోజులు తో శతదినోత్సవం జరుపుకున్నది.

శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాలు :–
1. విజయవాడ – జైహింద్ టాకీస్ (105 రోజులు)
2. గుంటూరు – కృష్ణ మహల్
3. నెల్లూరు. – శ్రీనివాస మహల్
4. రాజమండ్రి – వెంకట నాగదేవి
5. భీమవరం. – మారుతీ.
6. హైదరాబాద్ – సాగర్ (56 రోజులు) + జగత్ (షిఫ్ట్)
థియేటర్ లలో 100 రోజులు ప్రదర్శింపబడింది.

ఈ చిత్రాన్ని 1964 లో “వీరాథివీరన్’ పేరుతో తమిళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయగా, అక్కడ కూడా విజయవంతమైనది, అనంతరం హిందీ లోకి కూడా రీమేక్ చేసి విడుదల చేశారు.

Related posts