telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ యువతి ఓపల్‌ సుచాత

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌ విజేతగా నిలిచారు.

తన పేరును ప్రకటించగానే ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు. 2025 సంవత్సరానికి గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు.

గత సంవత్సరం (2024) మిస్‌ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా, 72వ ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌కు సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక పోటీలో పోలెండ్‌ దేశానికి చెందిన యువతులు రెండు ప్రధాన స్థానాల్లో నిలవడం గమనార్హం.

ఫస్ట్ రన్నర్‌ అప్‌గా మిస్‌ పోలెండ్‌ నిలవగా, సెకండ్ రన్నర్‌ అప్‌గా మిస్‌ పోలాండ్ నిలిచారు. మూడో రన్నర్‌ అప్‌గా మిస్‌ మార్టినిక్ నిలిచారు.

మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఓపల్ సుచాతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. సుచాత థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు.

Related posts