telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్..

whatsapp

వాట్సాప్‌… ఈ యాప్‌ని వాడని వారుండరు అనుకుంట. ఎందుకంటే.. మనం పొద్దున లేసిన నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌ను వాడుతాము. మొబైల్ లో‌ ఎక్కువగా వాడే యాప్‌ కూడా ఇదే కావడం విశేషం. వాట్సాప్‌… యూజర్ల కోసం ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ శుభవార్త చెప్పింది వాట్సాప్‌. యూజర్ల కోసం వాట్సాప్‌ మరో ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లోని ఛాట్‌ను బ్యాకప్‌ చేస్తే గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళుతుండగా.. దానికి ఎలాంటి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ లేదు. దీంతో ఛాట్‌ను బ్యాకప్‌ చేసినప్పుడు పాస్‌వర్డ్‌ పెట్టుకునే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొస్తుంది. ఆ ఛాట్స్‌ను రీస్టోర్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఈ పీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా… త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

Related posts