యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో వీరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే… హీరో ఎన్టీఆర్ ఈ సినిమాలో ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జాన్వీ కపూర్‌ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇక మరో ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే… దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందట.
previous post