ప్రపంచం అంత ఉత్తర కొరియా-అమెరికా స్నేహబంధం ఎప్పుడు బలపడుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ రెండు దేశాలమధ్య సఖ్యత ఏర్పడకుంటే, యుద్ధం ఖాయమని అందరికి తెలిసిందే. అదే జరిగితే, ఉత్తరకొరియా మొదటిగా వాడేది అణుబాంబే.. దానితో ఎన్ని ఇబ్బందులో అందరికి తెలిసిందే. అందుకే ఉత్తరకొరియా అంటే అమెరికా కూడా ఆచితూచి అడుగులు వేస్తూ, స్నేహపూర్వక వాతావరణం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అది ఎప్పటికప్పుడు అందని ద్రాక్షగానే ఉంటుంది. ఇరువురి ప్రయత్నాలు శాంతి వైపు అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తున్నా, ఎక్కడో ఏదో భయం ప్రపంచ దేశాలను పీడిస్తూనే ఉంది.
అసలు ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా చేయనంతగా ట్రంప్ ఉత్తరకొరియాతో స్నేహసంబంధాల కోసం ప్రయత్నించడం గమనార్హం.. కానీ ఈ ప్రయత్నాలు అన్ని దున్నపోతుమీద వర్షం పడినట్టే ఉంది కిమ్ కి మాత్రం. అమెరికా పెడుతున్న ఆంక్షలు తమ స్వాతంత్య్రానికి ప్రశ్నర్ధకంగా ఉన్నాయంటూ తాజాగా ఆదేశ విదేశీవ్యవహారాల శాఖ ప్రకటించడం .. తాజా అమెరికా ప్రయత్నాలు కూడా బూడిదలో పోసిన పన్నీరనే తెలియజేస్తున్నాయి. మరి ఉత్తర కొరియా ఆగ్రహావేశాలు ఎప్పుడు చల్లరనున్నాయో..!!