జలమండలి గ్రేటర్ ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి తరలింపులో అప్రమత్తమైంది. ఎండలు తీవ్రంగా ఉండడంతో నీటి డిమాండ్ పెరుగడం, ఇదే సమయంలో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు శరవేగంగా అడుగంటి పోతున్న నేపథ్యంలో అత్యవసర పంపింగ్ ద్వారా నీటి జలాలను తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు నిత్యం 900 క్యూసెక్కుల నీటిని తరలించే 10 ఎమర్జెన్సీ పంపింగ్ మోటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసి వచ్చే వారంలో ట్రయల్ రన్ చేపట్టి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా రోజూ 270 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీల) నీటిని తరలించి నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
పవన్ అలా మాట్లాడడం సరికాదు: కేటీఆర్