telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉచిత వ్యాక్సిన్‌కు బీహర్‌ ప్రభుత్వం ఆమోదం..

బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు ఇవ్వాలని నితీష్‌ ప్రభుత్వం డిసైడ్‌ అయింది. ఈ మేరకు సీఎం నితీష్‌ కుమార్‌ “అందరికీ ఉచిత వ్యాక్సిన్‌” అన్న దానిపై ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఫ్రీ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది కేబినెట్‌. బిహార్‌లోని ప్రతి వ్యక్తికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోం వర్క్‌ చేయాలని సీఎం నితీష్‌ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. “అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించే పద్ధతులపై అధ్యయనం చేస్తున్నాం. మొట్టమొదట వ్యాక్సిన్‌ ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తాం. దీనిపై సమగ్ర విధానంతో త్వరలోనే ప్రజల ముందుకు వెళ్తామని ” ఓ అధికారి తెలిపారు. కాగా.. ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related posts