telugu navyamedia
రాజకీయ వార్తలు

పోర్టుల్లో చైనా దిగుమతులపై నిఘాను పెంచాం: నితిన్ గడ్కరీ

Nithin Gadkari

చైనా నుంచి వస్తున్న దిగుమతులపై చెన్నై, విశాఖపట్నం పోర్టుల్లో కస్టమ్స్ నిఘాను ముమ్మరం చేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలోని చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ కంపెనీల్లో కూడా చైనాను అనుమతించబోమని అన్నారు.

మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైన సందర్భాల్లో కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమని గడ్కరీ స్పష్టం చేశారు.
జాతీయ రహదారులకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు. మన దేశ కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే, రీబిడ్డింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

Related posts