కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో నీతి అయోగ్ టీమ్ ప్రకృతి వ్యవసాయం, మహిళా సంఘాల కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. నీతి అయోగ్ టీమ్ తొలుత
బత్తుల సతీష్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ వరి పొలాన్ని పరిశీలించింది.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, టీమ్ సభ్యులు కలసి వ్యవసాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. సాగు పద్ధతుల్లో అవలంబిస్తున్న విధానాలను ఆరా తీశారు. రైతులతోనూ, డ్వాక్రా మహిళా సంఘాలతోనూ వేర్వేరుగా సమావేశమై అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరువవుతున్నాయా? లేదా? గ్రామీణప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందనే అంశంపై నీతి అయోగ్ కమిటీ సభ్యులు తెలుసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన నీతి అయోగ్ బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ భేటీకానుంది. ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళి అమలు తీరూతెన్నులపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయనుంది. సంక్షేమ పథకాల్లో సర్కారు విధానాల్లో మార్పుచేర్పులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.


టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో బీజేపీ: కన్నా