telugu navyamedia
రాజకీయ

పార్లమెంటులో అగ్ని ప్రమాదం..

దేశ రాజధాని ఢిల్లీలోనిభారత పార్లమెంటు  భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి, పది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు.

Parliament Winter Session LIVE Updates: 26 bills on agenda, Oppn demands  legal backing for MSP | India News – India TV

పార్లమెంటు భవనంలోని రూమ్ నంబర్ 59 వద్ద బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని అధికార వర్గాలు తెలిపాయి..అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయ‌ని, ఈ ఘటనలో కొన్ని కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయ‌ని తెలిపారు.

ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నవంబర్ 29న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23న ముగియనున్నాయి.

Related posts