telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నర్సాపురంలో ఇరిగేషన్ అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన

నర్సాపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఇరిగేషన్ అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు.

ఈ ఏడాది రబీ సీజన్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో 9.50 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశాం ధాన్యం డబ్బు రైతులకు రూ.1780 కోట్లు చెల్లించాం అన్నారు.

నాడు రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బందులు పడ్డారు, రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది ఇప్పడు రైతులు నచ్చిన మిల్లులకు ధాన్యం అమ్ముకుంటున్నారు 48 గంటల్లో నగదు బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది అన్నారు.

జగన్ ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను రైతులకు రూ.1,654 కోట్లు చంద్రబాబు చెల్లించారు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Related posts