telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడు రోజులుగా విపరీతమైన ఆల్కహాల్ తీసుకుంటున్నా…

kajal

కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్ తెరపై మెరిసింది ఈ ముద్దుగుమ్మ. చందమామ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో… టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. సోషల్ మీడియాలో కూడా ఈ భామ భలే యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటుంది. అయితే కాజల్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘గత మూడు రోజులుగా విపరీతమైన ఆల్కహాల్ తీసుకుంటున్నా… అందుకు నా చేతులే సాక్ష్యం.. కానీ లివర్ మాత్రం క్షేమంగా ఉంది’అనే పోస్టును కాజల్ ట్వీట్ చేసింది. దీంతో పాటు మరో పోస్టును కూడా పెట్టింది. ‘ఇప్పుడేం ఏం చేస్తే మంచిదని స్టాక్ బ్రోకర్‌ను అడిగితే… దైవ నామస్మరణ అని ఆయన జవాబు చెప్పాడు’ అనే ట్వీట్ కూడా కాజల్ చేసింది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలుతున్న విషయం తెలిసందే. అందుకే.. స్టాక్ బ్రోకర్లు కూడా ఈ సమయంలో దైవనామస్మరణ మంచిదని చెబుతున్నారని కాజల్ అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.

Related posts