telugu navyamedia
సినిమా వార్తలు

“దర్బార్”కు నయనతార

Nayanatara

రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “దర్బార్”. రజినికాంత్ 167వ సినిమా ఇది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రజనీకాంత్ తదితరులపై కొన్ని రోజుల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగులో ఈ రోజున నయనతార జాయిన్ అయిందనేది తాజా సమాచారం. రజనీ, నయన్ కాంబినేషన్లో వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అభిమానులు రజనీ సరసన నయనతారను చూసి చాలా కాలమే అయింది. అందువలన ఈ కాంబినేషన్ పై వాళ్లంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. సామాజిక సేవకుడిగా ఆయన మరో పాత్రలోను కనిపించనున్నాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది. రజనీ, మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts