telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం స్వీకారం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం స్వీకారం చేశారు. స్పీకర్ కార్యాలయంలో నవీన్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రమాణ స్వీకారం చేయడం తన అదృష్టమన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలపెట్టుకుంటానని తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పని చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని స్థానిక సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకానికి మరింత పెంచిందన్నారు.

ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీకి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts