*బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత..
*గద్వాల్‌లో పాదయాత్రలో అడ్డుకున్న టీఆర్ ఎస్ కార్యకర్తలు..
*టీఆర్ ఎస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ..
*ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. . తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్..
జోగులాంబ గద్వాల జిల్లాలో బండి సంజయ్ ఇటిక్యాల మండలం వేములలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతుండగా కొంతమంది మంది టీఆర్ ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.టీఆర్‌ఎస్ శ్రేణులను వేరే ప్రాంతానికి తరలించారు. సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు: రేవంత్రెడ్డి