telugu navyamedia
రాజకీయ

ఆశిష్‌ మిశ్రా బెయిల్ రద్దు.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం

*లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దు..
*అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీం కోర్టు 
*వారంలోగా లొంగిపోవాల‌ని అశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఆదేశం

లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల్లో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అశిష్‌ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. .

అంతేగాక వారంలోగా లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

గ‌తంలో ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది’’ అని సుప్రీం పేర్కొంది.

Lakhimpur Kheri Violence: Plea in Supreme Court for Cancellation of Bail of  Union Minister's Son

నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో అక్టోబరు 9వతేదీన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఫిబ్రవరి 10న అలహాదాబ్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరుచేసింది.

ఆశిష్‌కు అలహాబాద్‌ హైకోర్టు బెయిలివ్వడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ నాలుగో తేదీన విచారణ పూర్తి చేసింది. బెయిల్ రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది.

Related posts